వైసీపి పట్టణ అధ్యక్షులుగా మారిశెట్టి గిరి… శాలువాతో గిరిని సత్కరించిన మాజీ మంత్రి కారుమూరి…

లీడర్ న్యూస్ (తణుకు) సౌమ్యుడు, నిబద్ధతతో పనిచేసేతత్వమున్న మారిశెట్టి శేషగిరిని పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమని మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని రెండుసార్లు కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తించి ప్రజల సమస్యల పరిష్కారానికి నోచుకున్న శేషగిరి అందరితోను కలుపుగోలుగా వ్యవహరించే వ్యక్తి అన్నారు. పట్టణ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి మాట్లాడుతూ మాజీమంత్రి కారుమూరి, పార్టీ శ్రేణులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం కష్టపడతానని, రానున్న రోజుల్లో ప్రజలకు అండగా నిలబడి పార్టీ చేసే కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. అనంతరం శేషగిరిని మాజీ మంత్రి కారుమూరి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా  ఆర్గనైజేషన్‌ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్‌ జిల్లా అధ్యక్షులు జల్లూరి జగదీష్, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్‌ మారిశెట్టి శివశంకర్, ప్రచారకమిటీ తణుకు నియోజకవర్గ అధ్యక్షులు ఫణీంద్రకుమార్‌ వీరమల్లు, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్‌అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, నియోజకవర్గ మైనారిటీ సెల్‌ అధ్యక్షురాలు షేక్‌ ఫహీమా, వి.సీతారాం, కర్రి గంగాధర అప్పారావు, పుల్లెపు సూర్యచంద్రరావు, ఝాన్సీ లారెన్స్, గంజి సతీష్, గారపాటి సత్యనారాయణ, పార్థసారధి, వై.రామకృష్ణ, చింతాడ సంజీవరావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *