లీడర్ న్యూస్ (తణుకు) అనారోగ్యాలు పాలై అత్యవసర పరిస్థితుల్లో ప్రవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం వంటిదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మంత్రి క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు నియోజకవర్గంలో మూడు మండలాలు పరిధిలో86 మంది లబ్ధిదారులకు రూ 62.33 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను లబ్దిదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్వీర్యం చేసారని,ఒకటో రెండో ఇచ్చి చేతులు దులుపుకుని కునేవారని అన్నారు.ఎన్డీఏ ప్రజా ప్రభుత్వంలో ధరఖాస్తు చేసుకున్న వారందరికీ నూటికి నూరుశాతం లబ్ధిదారులకు చెక్కులను అందజేసి ఆదుకుంటున్నామన్నారు. నిరుపేదల అభివృద్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు.ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను సియం సహాయనిధి ఆపద్భందువునిగా అదుకుంటుందని ఆయన తెలిపారు.
నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం – మంత్రి నిమ్మల రామానాయుడు
10
Mar