లీడర్ న్యూస్ (తణుకు) అసంఘటిత కార్మికులుగా వున్న కొబ్బరి ఒలుపు, దింపు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని వారి అభివృద్ధికి సమగ్ర శాసనం తేవాలని తణుకు ఏరియా కొబ్బరి ఒలుపు, దింపు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు.
మంగళవారం చుక్కవానితోట గ్రామం కొబ్బరి తోటలో జరిగిన తణుకు ఏరియా కొబ్బరి దింపు ఒలుపు కార్మిక సంఘం కమిటీ సమావేశంలో భీమారావు మాట్లాడుతూ కొబ్బరి దింపు, ఒలుపు కార్మికులు చెట్లు ఎక్కుతూ దిగుతూ ప్రమాదాలకు గురయ్యే వారికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, అంగ వైకల్యం గురైన కార్మికులకు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని భీమారావు కోరారు.