మరో 680 టన్నుల ధాన్యం కొనుగోలుకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం…

పత్రికా ప్రకటన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

– వడ్లూరు లో 300 టన్నులు, పసలపూడిలో 200 టన్నులు, మరో ఐదు గ్రామాల్లో 180 టన్నుల ధాన్యం సేకరణకు చర్యలు…

– మంత్రి దుర్గేష్ అడిగిన వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయడంపై రైతుల్లో సంతోషం…

లీడర్ న్యూస్ (నిడదవోలు) ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి కందుల దుర్గేష్ భరోసానిచ్చారు.. వియత్నాం పర్యటనలో ఉన్న మంత్రి దుర్గేష్ నియోజకవర్గ రైతుల కోరిక మేరకు మరో 680 టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదివారం అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం లోని వడ్లూరు లో 300 టన్నులు, పసలపూడిలో 200 టన్నులు, మరో ఐదు గ్రామాలైన సత్యవాడ, సూర్యారావు పాలెం, తాడిపర్రు, వెలివెన్ను, కాల్దారి గ్రామాల్లో 180 టన్నుల ధాన్యం కొనుగోలుకు ఆదేశించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. త్వరలోనే నియోజకవర్గంలోని మిగితా ప్రాంతాల్లో మరిన్ని టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.. ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచమని అడిగిన వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన మంత్రి కందుల దుర్గేష్ పని తీరుపై నియోజకవర్గ రైతాంగం సంతోషం వ్యక్తం చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *