ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి పథకాలు అమలు చేయకపోవడంపై వైసీపీ నాయకుల పోరుబాట… ఏలూరు కలెక్టర్ కి వినతి పత్రం అందజేత…

లీడర్ న్యూస్ (ఏలూరు) ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి పథకాలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరులోని ఫైర్ స్టేషన్ నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి  జిల్లా కలెక్టర్ కి  వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా , రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, కైకలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు (DNR), పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇంచార్జిలతో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *