జీఎస్టీ సంస్కరణలతో ఎంతో మేలు – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ న్యూస్ (తణుకు) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సూపర్‌ జిఎస్టి – సూపర్‌ సేవింగ్‌ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 10 నుంచి రూ. 15 వేలు వరకు ఆదా అవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులకు సైతం అమ్మకాలు పెరినట్లు చెప్పారు. కిరాణా వస్తువులపై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించడం ద్వారా 13 శాతం ఆదా అవుతోందన్నారు. ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీ 18 శాతం నుంచి 0 శాతానికి తీసుకువచ్చిన ఘనత ఎన్డీ కూటమి ప్రభుత్వ సారధులు నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు దక్కుతుందన్నారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, జీవన పథకాలు తదితర వస్తువులపై జిఎస్టి లో వచ్చిన మార్పుల కారణంగా రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. గతంలో 12 శాతం ఉన్న జీఎస్టీను ఐదు శాతానికి తగ్గించడం వల్ల యాంత్రికరణ పరికరాలపై రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో భవిష్యత్తులో సైతం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *