లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఆటో రిక్షా, మాక్సి క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్స్ మొత్తము 1265 మందికి ఒక కోటి 89 లక్షల 75 వేల రూపాయల నిధులను విడుదల చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆదే సభలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాను 2,00,000/- రూపాయలు తన స్వంత డబ్బులు ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు తన కార్యాలయంలో ఆటో డ్రైవర్ల నాయకులకు 2,00,000/- రూపాయల నగదు ను అందచేశారు.అలాగే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ రోజుకి రెండు రూపాయల చొప్పున యూనియన్ చందా క్రింద చెల్లించి, ఆ వచ్చిన డబ్బుతో కష్టంలో వున్న ఆటో డ్రైవర్ల కోసం ఉపయోగించాలని కోరారు.
ఆటో డ్రైవర్స్ యూనియన్ కి 2లక్షలు సొంత నిధులు అందజేసిన ఎమ్మెల్యే బోలిశెట్టి…
05
Oct