లీడర్ న్యూస్ (తణుకు) రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీపుల్స్ పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానం ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయమైందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఎక్కువ ఉచిత సీట్లు, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్యం రావడం ఇష్టం లేని జగన్మోహన్రెడ్డి వ్యక్తికి తప్ప సర్వప్రయోజనాల విధానం పీపీపీ విధానం సర్వత్రా ఆమోదనీయమైందన్నారు. పీపీపీ మోడల్ కారణంగా కలిగే విస్తృత ప్రయోజనాల గురించి ప్రపంచమంతా తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో రాష్ట్రంలో ప్రారంభించిన ఈ విధానానాన్ని అన్ని దేశాల్లో అనుసరించడం అభినందనీయమని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయమైన పీపీపీ విధానం – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
06
Oct