లీడర్ న్యూస్ (తణుకు)ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించడంతోపాటు వసతుల కల్పనకు దృష్టి సారించాల్సిన అవసరత ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం తిరుపతిలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉన్నత విద్య ఫలితాల పనితీరు, ఆడిట్ అనే అంశంపై భారత ప్రభుత్వ చట్టం నివేదికపై సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడి హోదాలో అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు సాధించాలంటే పలు యూనివర్సిటీలతో కలిసి సమన్వయం చేసుకోవాలని అన్నారు. పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలో అభివృద్ధి సాధించలేకపోతున్నాయని అన్నారు. కెరియర్ కౌన్సిలింగ్, ప్లేస్ మెట్ అంశాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాలజాతి సంస్థలతో సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.
బహుళజాతి సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి – తణుకు ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ…
09
Oct