లీడర్ న్యూస్ (తణుకు) తణుకులో సంచలనం సృష్టించిన దోపిడి ఘటనలో పదిమంది అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం డిఎస్పి విశ్వనాధ్ తెలియజేశారు. ఈ మేరకు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 26న తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలు వాకలపూడి కనకదుర్గను బెదిరించి 70 కాసులు బంగారు ఆభరణాలు, రూ. 70 వేలు నగదుని దొంగల ముఠా అపహరించారు.ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ పోలీస్ లు కేసు నమోదు చేశారు. తణుకు పట్టణ సిఐ ఎన్.కొండయ్య ఆధ్వర్యంలో ఆరు బృందాలను డిఎస్పి విశ్వనాధ్ ఏర్పాటు చేశారు.మహారాష్ట్రకు చెందిన సందీప్ రామశంకర్ ఉపాధ్యాయ, మహమ్మద్ ఇక్బాల్ షేక్ తో పాటు రాజమండ్రి తాడితోటకు చెందిన మీసాల శ్రీనివాసరావు, నిమ్మకాయల శ్రీకాంత్, దుర్గాపు సత్యనారాయణ, దివ్వల యేసు, శ్రీకాకుళం చిన్నా, అంబటి రాజేష్, బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామానికి చెందిన గొర్రెపూడి వెంకటరమణ, తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి కి చెందిన కర్రీ సాయి చంద్రారెడ్డి లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుల నుంచి సుమారు 30 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నేరం చేసిన తర్వాత నిందితులు మహారాష్ట్ర ముంబాయి పారిపోగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.కేసు దర్యాప్తులో సహకరించిన తణుకు పట్టణ, తణుకు రూరల్, తాడేపల్లిగూడెం రూరల్ సీఐలు ఎన్. కొండయ్య, బి. కృష్ణకుమార్, బీబీ రవికుమార్ తో పాటు ఎస్ఐలు కె.శ్రీనివాస్, కె.ప్రసాద్, డి. ఆదినారాయణ, కె.చంద్రశేఖర్, పి. ప్రేమరాజులకు డిఎస్పి విశ్వనాధ్ అభినందనలు తెలియజేశారు.కేసు దర్యాప్తులో సహకరించిన ఎస్.శ్రీధర్, పి.సంగీతరావు, పి.సత్యనారాయణ, కానిస్టేబుళ్లు టి.రవి, డి.వెలగేశ్వరావు, పి.రాంబాబు, శివాజీ, అన్వర్, ఎం.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, అక్బర్ లాల్ కు డీఎస్పీ విశ్వనాధ్ అభినందనలు తెలిపారు.
తణుకులో దోపిడి ఘటనలో పదిమంది అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు అరెస్ట్…
10
Oct