ప్రభుత్వ సహకారంతోపాటు దాతల సహకారం అవసరం – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 

లీడర్ న్యూస్ (తణుకు) జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులతో భోజన శాల నిర్మించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వ సహకారంతోపాటు దాతల సహకారం ఉంటేనే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం చౌదరి, నీలిమ దంపతులు ఆర్థిక సాయంతో సుమారు రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించిన భోజనశాల నిర్మాణాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల ప్రారంభించిన నాటి నుంచి స్వర్గీయ ఆరిమిల్లి వెంకటరత్నంతో పాటు ఆయన కుటుంబం పాఠశాలకు నిర్మాణానికి స్థలాన్ని సేకరించి దాతల సహకారంతో అనేక నిర్మాణాలు చేపట్టి ప్రస్తుతం అదే ఒరవడిని కొనసాగించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో సైతం ఇదే ఒరవడిని వేల్పూరు గ్రామ ప్రజలతోపాటు దాతలు ముందుకు వచ్చే పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించిన మాజీ సర్పంచులు పెనుమర్తి సోమ సూర్యచంద్రరావు, వెంకటలక్ష్మి దంపతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *