కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వాహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్…

లీడర్ న్యూస్ (కాకినాడ) కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్య నియంత్రణ, ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో తీర ప్రాంత కాలుష్యంపై పవన్ అధికారులతో చర్చించారు. కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాట.. మంతిలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారు వెలిబుచ్చిన సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు.పొల్యూషన్ ఆడిట్ కి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు.కాకినాడ జిల్లాతోపాటు గోదావరి జిల్లాలలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై కూడా చర్చించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *