లీడర్ న్యూస్ (తణుకు)తణుకు పట్టణంలో ఉండ్రాజవరం సెంటర్ నుండి పాలంగి వెళ్లే రోడ్డులో తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిపిన సోదాలలో స్కూటీలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరూ స్థానిక పైడిపర్రు,మండపాక గ్రామమునకు చెందిన యువకులుగా గుర్తించారు. వీరిలో ప్రధాన నిందితుడు పోలవరపు కుమార్ శివ పరారీలో ఉన్నాడు. ఇతను మిగతా ఇద్దరికీ కూడా అనగా మీసాల ఈశ్వర రావు, చీలి వినయ్ కి గంజాయిని సరఫరా చేస్తున్నాడు. వీరు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తణుకు పట్టణములో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తెలియవచ్చినది. వీరు కేజీ గంజాయిని 3000 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలియపరిచారు. మొత్తం పట్టుబడిన గంజాయి విలువ సుమారు 15 ,000 రూపాయలు ఉంటుంది.ఈ సోదాలలో తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తో పాటు తణుకు డిప్యూటీ తాసిల్దార్ నీలి శ్రీదేవి, వీఆర్వో బసవ వెంకటరత్నం, ఎస్సై ఆర్. మధుబాబు, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి రవాణా, అమ్మకములు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. గంజాయి కి సంబంధించి నిల్వలు ,రవాణా మరియు అమ్మకాలుకు సంబంధించి సమాచారాన్ని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారికి 9440902436 నెంబర్ కి తెలియపరచవలసిందిగా సూచించారు.
తణుకు పట్టణంలో ఎక్సైజ్ సోదాలు…గంజాయి రవాణా దారులు అరెస్ట్…
12
Oct