లీడర్ న్యూస్ (తణుకు) ట్రంప్ టారిప్ లతో భారతదేశంపై బ్రహ్మ రాక్షసిల దాడి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్ర రావు ఆరోపించారు. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా వేల్పూరు గ్రామంలో స్థానిక టైలర్స్ బొమ్మ వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వదా (చిత్రపటం దగ్ధం)చేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ పురాణాల చరిత్ర ప్రకారం దేవతలను వేధింపులకు గురిచేసిన నరకాశుర రాక్షసుడిని అంతమొందించిన రోజు బాణాసంచా కాల్పులతో ఎంతో ఆనందంగా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా దీపావళి పండుగ జరుపుకుంటున్నారని, అందుకే భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అధిక టారిఫ్ లు పెంచి భారత్ ఉత్పత్తిని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న మానవ రాక్షసుడు డోనాల్డ్ ట్రంప్ వదా కార్యక్రమం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అమెరికా నుంచి భారతదేశానికి పన్నులు లేకుండా డైరీ (పాల ఉత్పత్తులు) వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నదని అదే జరిగితే మన దేశ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టపడుతుందని గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులు పాలై ఆకలి చావులు. ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిలో భారత దేశ రైతాంగాన్ని యువత భవిష్యత్తును కాపాడవలసిన మోడీ ప్రభుత్వం అమెరికా దుర్మార్గాలను కనీసం నోరెత్తి ఖండించక పోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. మనకన్నా చిన్న దేశాలు అమెరికాపై ఎదురు తిరుగుతున్నాయని గుర్తు చేశారు. కాబట్టి రైతులు. గ్రామీణ కార్మికుల జీవితాలు హస్తావ్యస్థం కాకుండా మోడీ ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదం తో రాజీ పడకుండా ఉండాలని భారతదేశ సంపదను సార్వభౌమత్వాన్ని కాపాడాలని వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు విశ్వనాథం సుబ్బారావు, వాసా వెంకటేశ్వరావు, యండమూరి నాగేంద్ర, అందే కోట నరసింహారావు,తాళ్ల సత్యనారాయణ, బొక్క మోహన్ రావు, రుద్రాక్షల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వేల్పూరులో ట్రంప్ చిత్ర పటం దగ్ధం చేసిన రైతు కార్మిక సంఘం…
21
Oct