లీడర్ న్యూస్ (తణుకు) అటు సినీరంగం ఇటు సేవా రంగంలో కృష్ణంరాజు, ప్రభాస్ కుటుంబ సభ్యులు తమదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం తణుకులో ప్రభాస్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చరిత్రకు నాంది పలికిన నటుడు ప్రభాస్ అన్నారు. కేవలం తెలుగు అభిమానులనే కాకుండా దేశంలోని అభిమానుల హృదయాలను దోచుకుని డార్లింగ్‌గా మనసుల్లో ముద్ర వేసుకున్నారని చెప్పారు. తెలుగు చిత్రసీమలోనే కాకుండా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాలుగా నిలిచాయన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిఒక్కరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రభాస్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభాస్‌ను ఆదర్శంగా తీసుకుని ఆయన అభిమానులు సైతం సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. అనంతరం కేకు కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమాన సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
సినీనటుడు ప్రభాస్ జన్మదిన వేడుకలు…కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
24
Oct