లీడర్ న్యూస్ (తణుకు) ఇటీవల మొంథా తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్నివేళలా అధికారులు, కూటమి నాయకుల మధ్య చక్కని సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తుపాను ప్రభావం వల్ల ఇబ్బందులు పడిన బాధిత కుటుంబాలకు ప్రత్యేక పునరావాస కేంద్రాలు, సాయం అందేలా చేయడం జరిగిందని తెలిపారు . ఇరగవరం మండలంలోని 250 కుటుంబాలకు పది కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరకుల పంపిణీ చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రజలతోపాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని, తుపాను కారణంగా తణుకు నియోజకవర్గంలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడమైందన్నారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, వారిని అభినందించారు.
తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమన్వయంతో జాగ్రత్తలు తీసుకున్నాం – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
02
Nov