లీడర్ న్యూస్ (తణుకు) మొట్టమొదటిసారిగా మహిళా క్రికెట్ లో మొదటిసారి భారత్ ప్రపంచకప్ సాటించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మహిళ టికెట్ వరల్డ్ కప్ ఇండియా గెలుపొందడం పట్ల సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది భారతీయులు తన అభిమాని తేడాగా క్రికెట్లో ఆరాధిస్తూ ఉంటారని చెప్పారు. ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా మహిళ క్రికెట్ ప్రపంచకప్ భారతదేశం సాధించడం గర్వకారణమని అన్నారు. మహిళల్లో స్ఫూర్తి పెంచే విధంగా ప్రపంచ కప్ ఫైనల్లో క్రీడాకారులు చూపిన ప్రతిభ భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని అన్నారు. ప్రపంచంలోనే వికెట్లు దగ్గర ఉన్నాయా దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ కైవసం చేసుకోవడం దేశానికి గర్వకారణం అని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రికెట్ వరల్డ్ కప్ భారత్ సాధించడం అభినందనీయం.. *మహిళా టీం సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ….
03
Nov