లీడర్ న్యూస్ (తణుకు)స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎస్సెంషియల్ ఫాకల్టీస్ లో ఘనతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారని సంస్థ ప్రిన్సిపాల్ ఎల్ కె త్రిపాఠీ ఒక ప్రకటన లో తెలిపారు. స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ జాతీయ జండా ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులలో దేశ భక్తి ఉండాలంటే ముందు వ్యక్తిత్వం చాలా అవసరం అన్నారు. మంచి వ్యక్తిత్వం ఉంటే మంచి కుటుంబం, మంచి సమాజం సృష్టించి, భారత దేశంలోనే ఒక మంచి పౌరుడి గా తయారవొచ్చు అని అన్నారు.అలాగే SSC 2025 ఫలితాలులో 600 కి గాను 596 మార్కులు తో టౌన్ ఫస్ట్ సాధించిన యు. హన్సిత పద్మిని మరియు పాలీసెట్ 25 లో స్టేట్ ఫస్ట్ మార్క్ 120 కి గాను 120 మార్కులు సాధించిన పవన్ సాయి రామ్ కి నగదు బహుమతి, మూమెంటో మరియు శాలువా తో సత్కరించారు.వివిధ సాంస్కృతిక కార్యమాలు, చిన్నారుల విచిత్ర వేశాధారణ అందరి కళ్ళు కు ఆకట్టుకున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో రూట్స్ డైరెక్టర్ ఎన్ సుధాకర్ వర్మ, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.