లీడర్ న్యూస్ (తణుకు) పశ్చిమగోదావరి జిల్లాలో డ్రెయిన్స్ బాగు చేయవలసిన అవసరం ఎంతో ఉందని, డ్రెయిన్స్ పూడిపోవడం వల్ల నీరు చేల నుండి బయటకు వెళ్ళలేక చేలోనే నీరు నిల్వ ఉండి, పంటలు వేసుకొనే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాధ్ పేర్కొన్నారు.తణుకు మండలంలో తేతలి నుండి మండపాక డ్రైన్ వరకు ఉన్న డ్రైన్ కొన్ని చోట్ల ఆక్రమణలకు గురై కొన్ని చోట్ల వెడల్పు బాగా తగ్గి నీరు నిలిచి పోతుందన్నారు. దీని మూలంగా తేతలిలో 200 వందలు ఎకరాలు సేద్యంనికి ఉపయోగపడకుండా పోయిందని, ఈ ప్రాంతంలో డ్రైన్ వెడల్పు చేసి, ఆక్రమణలు తొలగిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలో ఉన్న యనమదుర్రు డ్రైన్,నక్కల కాల్వ, ఇతర డ్రైన్ లను కూడా వెంటనే మరమత్తులు చేస్తే వచ్చే పంటలను రైతులు సద్వినియోగం చేసుకుంటారన్నారు.అలానే మురుగు నీరు నిల్వ మూలంగా దోమలు పెరిగి వ్యాధులు వ్యాప్తిని కూడా అరికట్టాలని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైయిన్ బాగుచేయాల్సిన అవసరం ఉంది – ఎమ్మెల్సీ వంక రవీంద్రనాధ్
13
Mar