లీడర్ న్యూస్ (తణుకు) స్వచ్ఛమైన పాలనకు నిదర్శనం, అభివృద్ధికి మార్గదర్శకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. విజన్ ఉంటే నాయకుడు, మిషన్ ఉంటే మహానాయకుడని అలాంటి మహానేత మన నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. సంకల్పం ఉంటే రాష్ట్రాన్ని ఎలా మార్చొచ్చో, అభివృద్ధి అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప దార్శనికుడు అన్నారు. పదవి కోసం కాకుండా కేవలం ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన నిజమైన నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ను నూతన భవిష్యత్తు వైపు తీసుకెళ్తున్న చంద్రబాబు 2047 విజన్ లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పని చేసినా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతుంటారన్నారు. గతంలో జన్మభూమి, శ్రమదానం, పచ్చదనం పరిశుభ్రం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ప్రజల భాగస్వామ్యం ద్వారా స్వచ్ఛమైన పాలన అందించి అభివృద్ధికి మార్గదర్శకుడిగా నిలిచారని చెప్పారు. స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ద్వారా తణుకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా నడిపిస్తున్న ఉద్యమంలో మనమందరం భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో సింగల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటున్న ఈ చర్యలలో మనమందరం భాగస్వాములు కావాలన్నారు. అయిదేళ్లు వైఎస్ఆర్ పార్టీ పాలనలో తణుకు పట్టణంలో విధ్వంసం సృష్టించి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అయిదేళ్లు డ్రైనేజీలు శుబ్రం చేయకుండా కనీసం దోమల మందు కొట్టించకుండా పార్కుల నిర్వహణ గాలికి వదిలేసి కేవలం సంపాదనే లక్ష్యంగా అవినీతిలో తణుకుని అగ్రగామిగా నిలిపారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా పరిషత్తు చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ప్రభుత్వ విప్‌లు బొల్లినేని శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, మౌలికసదుపాయాల, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి సురేష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి సూర్యకుమారి, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్షి్మ, శాసన మండలి మాజీ సభ్యులు అంగర రామ్మోహన్, మాజీ శాసన సభ్యులు ముళ్ళపూడి వెంకట కృష్ణారావు, బిజెపి జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
అభివృద్ధికి మార్గదర్శకుడు చంద్రబాబు – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
16
Mar