లీడర్ న్యూస్ (తణుకు) గత ప్రభుత్వం పరిపాలన నేటి ప్రభుత్వ పరిపాలన అనే విధంగా ( నాడు- నేడు) ప్రజలే నిర్ధారించుకుని విధంగా పాలన సాగుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగుంటలో కొమ్ముగూడెం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నుంచి రోడ్ల పరిస్థితి వరకు అంతా అంతా సమీక్షించుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వారికి సకాలంలో సొమ్ములు వారి ఖాతాలకి జమ చేసే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వారి వారికి ఇష్టమైన రైస్ మిల్లుకు వారి ధాన్యాన్ని తోలుకునే విధంగా వ్యవస్థ రూపొందించామని అంతా కూడా ట్రక్ షీట్ వేసే వరకు జాగ్రత్తగా ఉంటే ధాన్యం సోము వారి ఖాతాలకు త్వరగా జమవుతుందని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్న రైతు భరోసా కేంద్రం వద్ద జిల్లా స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరి అధికారుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని వారికి మీ సమస్యలు తెలియజేసే అవకాశం ఉందని వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై విత్తనాలను రైతులకు అందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి జెడ్ వెంకటేశ్వరరావు, ఆర్డిఓ కత్తి కౌసర్ భాను, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శివప్రసాద్, సర్పంచ్ కట్టా సత్యవతి జానకిరామ్, జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్, జనసేన నాయకులు సిద్ధ వీర్రాజు, నాయకులు ఏపూరి సత్యనారాయణ, ఏ డి ఏ పీ మురళీకృష్ణ, కొమ్ముగూడెం సొసైటీ పర్సన్ ఇంచార్జ్ ఈ లక్ష్మీకాంతం, కొమ్ముగూడెం సొసైటీ సీఈవో సిహెచ్ ఎస్ వి ఎస్ వి కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.