లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి)తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాల (SCIM) విద్యార్ధి, విద్యార్ధులు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణని కలిసి స్వయంగా అసెంబ్లీ సమావేశాలు వీక్షించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్దులు అంటున్నారు. టీవీలలో చూడటం తప్ప స్వయంగా వచ్చి ఈ అసెంబ్లీ సమావేశాలు వీక్షించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని కల్పించిన స్పీకర్ కు , రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు…
తణుకు MLA ఆరిమిల్లితో పాటు అసెంబ్లీ సమావేశాలు వీక్షించిన SCIM విద్యార్థి, విద్యార్థినిలు
26
Jul