లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నేడు తణుకు నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి MLA ఆరిమిల్లి రాధాకృష్ణ డిప్యూటీ సిఎం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. ముఖ్యంగా గ్రామాలలో పి.ఆర్ రోడ్ల గురించి, జల జీవన్ మిషన్ నుండి ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగునీరు, నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయితీలలో నెలకోన్నటువంటి సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కి వివరించి త్వరితగతిని వాటికి పరిష్కార మార్గాలు చూపాలని కోరారు.