లీడర్ న్యూస్ (తణుకు) స్వర్ణాంధ్ర లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సంపన్న రాష్ట్రముగా తీర్చిదిద్దే క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు విజన్ 2047 సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.తణుకు నియోజవర్గ స్థాయి విజన్ యాక్షన్ ప్లాన్ 2047 యూనిట్ సమావేశాన్ని తణుకు మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించుకొని రాబోయే నాలుగేళ్లలో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం అమలు చేసే ప్రజల వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.పి4 విధానంలో అభివృద్ధి పనులు చేపట్టి తద్వారా ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించడం, వారి తలసరి ఆదాయం పెరిగే దిశగా కృషి చేస్తుందని అన్నారు.నియోజకవర్గం బలాలు, బలహీనతలతో పాటు ఆదాయ వనరులను సృష్టించుకునే విధానంపై కసరత్తు చేయాల్సి ఉందన్నారు.
విజన్ 2047 సాధించే దిశగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…
03
Apr