ఆటో కార్మికులకు అందించే భీమా…. కూటమి ప్రభుత్వ పనితీరుకు ధీమా… రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్

లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆటోడ్రైవర్ సేవలో పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి 15 వేల రూపాయలు చొప్పున అందించే భీమా పథకం కూటమి ప్రభుత్వ పనితీరుకు ధీమాగా ఉంటుందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఆటో రిక్షా, మాక్సి క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్స్ మొత్తము 1265 మందికి ఒక కోటి 89 లక్షల 75 వేల రూపాయల మెగా చెక్కును అందించే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం శాసనసభ్యులు పోలిశెట్టి శ్రీనివాస్  మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రోడ్లు లేక గోతులమయంతో ఉన్న రహదారులలో ఆటో కార్మికులు ప్రయాణం చేసి వారి వాహనాలు పూర్తిగా నాశనం అయ్యాయని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం హయాంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఏర్పాటు చేసిన రహదారులపై ఆటో కార్మికులు ప్రశాంతమైన ప్రయాణాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి కార్మికునికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని అన్నారు. వైసిపి పాలనలో ప్రజల ఖాతాలలో బిస్కెట్లను వేస్తూ ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రజలను కన్నీళ్లు పెట్టనివ్వకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో నేడు ఈ పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ఆటో కార్మికులు ఆకలితో అలమటించకూడదన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి కార్యరూపం దాల్చారని అన్నారు. తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే నూతనంగా నియోజకవర్గంలో వెలసిన రోడ్లు, డ్రైనేజీ మరమ్మత్తులు, పంట కాలువల మరమ్మత్తులు వంటి అనేక పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు మునుముందు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *