లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు తాడేపల్లిగూడెం హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి నిర్మాణం కొరకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిధులు లేక ప్రజలను తాడేపల్లిగూడెం నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయటానికి సహాయం కోరడంతో చాలామంది దాతలు ముందుకు రావడం చాలా ఆనందకు దాయకం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి ప్రతి ఒక్కరూ హై స్కూల్ గ్రౌండ్ కి ,స్విమ్మింగ్ పూల్ కి, ఇండోర్ స్టేడియం, ఇప్పటివరకు దాతల సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణానికి దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి కోరారు.
అభివృద్ధి పనులకు ప్రజా విరాళాలు ఇవ్వడం హర్షనీయం – ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్
05
Oct