పంట నష్టాల అంచనాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ నాగరాణి

లీడర్ న్యూస్ (తణుకు) జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తణుకు నియోజకవర్గం దువ్వ, ముద్దాపురం గ్రామాల్లో అర్నబ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తో కలిసి పరిశీలించారు. తుపాను ప్రభావం వలన కురిసిన అధిక వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి, ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని, నష్టం తీవ్రతను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల వివరాలను, పంట నష్ట అంచనాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తమకు ఖచ్చితమైన నివేదికలు సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు. పంట నష్టాల అంచనాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నమోదు చేయాలని, ప్రభావిత ప్రాంతాల్లో పంటల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. పంట నష్టపోయిన రైతులు ఎవ్వరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించుటకు సిద్ధంగా ఉందని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

ఈ పర్యటనలో తాడేపల్లిగూడెం ఆర్డిఓ సూర్యారావు, మండల తహసిల్దారు అశోక్ వర్మ , వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *