లీడర్ న్యూస్ (తణుకు) రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలు విధ్వంసానికి గురయ్యాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. అత్తిలి మండలంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం అత్తిలి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం విక్రయించినప్పటికీ సకాలంలో సొమ్ములు అందక ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. కనీసం రైతులకు గోనె సంచులు కూడా అందించలేని దుస్థితి అప్పట్లో నెలకొందన్నారు. ధాన్యం డబ్బులు రావడం లేదని ప్రశ్నించిన రైతులను అవమానించడంతో పాటు, వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
అత్తిలిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎన్నికల ప్రచారం…
31
Oct