సీఎం చంద్రబాబు నాయుడుతో జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ న్యూస్ (తణుకు) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడుతో ఆదివారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు, జోనల్ కోఆర్డినేటర్  ఆరిమిల్లి రాధాకృష్ణ  పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించేలా కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *