తణుకు జిల్లా ఆసుపత్రిలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు…

లీడర్ న్యూస్ (తణుకు) జిల్లా ఆసుపత్రి, తణుకు నందు మెడికల్ సూపరింటెండెంట్ డా. కె. సాయి కిరణ్  మార్గ దర్శకత్వంలో, సివిల్ ఆర్.ఎం.ఓ డా. ఎల్. సాయి బాలాజీ  సమన్వయంతో, Dr ప్రభవతి s r ఇతర వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది సహకారంతో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీతో పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మానసిక అనారోగ్యంపై ఉన్న అపోహలను తొలగించడం, మానసిక సమస్యలను తొలిదశలో గుర్తించడం, సకాలంలో వైద్య సహాయం పొందడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మానసిక సమస్యలతో బాధపడేవారు లేదా మానసిక ఆరోగ్య సలహా అవసరమైన వారు మన డ్రిస్టిక్ట్ హాస్పిటల్ నందు ఉచిత మానసిక ఆరోగ్య సలహా, వైద్య  సహాయం పొందవచ్చని తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ థీమ్ “అనుభవాలను ఆలకిద్దాం – నిజమైన స్వరాలు, నిజమైన మార్పు” అనే సందేశంతో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, మానసిక సమస్యలతో బాధపడేవారికి సహకారం అందించడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని మెడికల్ సూపరింటెండెంట్ కె. సాయి కిరణ్ తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *