లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం)గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండిసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బి. చంద్రశేఖర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టాయని వాటి ఫలితాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని ఎంపీడీవోను కోరారు.నిత్యం ప్రజల్లో మమేకమై పనిచేయాలని నిరంతరం గ్రామ సమస్యల పరిష్కారించే విధంగా మీ కార్యచరణ ఉండాలని సూచించారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేయండి – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…
05
Oct