లీడర్ న్యూస్ (తణుకు) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఆయన తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తణుకు నియోజకవర్గానికి అవసరమైన నిధులు, తదితర అంశాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.