లీడర్ న్యూస్ (తణుకు)భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మాజీ ప్రధాన కార్యదర్శి, విప్లవ యోధుడు చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి కార్యక్రమం గురువారం తణుకులో ఘనంగా జరిగింది. సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కోనాల భీమారావు మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు తన జీవితాంతం పీడిత ప్రజల పక్షాన పోరాడారని, వారి త్యాగనిరతి నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని గుర్తుచేశారు.సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు,సిపిఐ తణుకు ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి,సిపిఐ నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు, అమ్మిరాజు,బండి వెంకటేశ్వరరావు,మందుల ముత్తయ్య,కొంబత్తుల రవికుమార్,బొద్దాని మురళీ, బొద్దాని కృష్ణ కిషోర్,రెడ్డి రామకృష్ణ, నూనె రాధాకృష్ణ తదితరులు పాల్గొని చండ్ర రాజేశ్వరరావుకు నివాళులర్పించారు.