లీడర్ న్యూస్ (తణుకు)ఎమ్మెల్యే కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సందర్శకుల కోసం మజ్జిగ చలివేంద్రం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత వేసవిలో సందర్శకులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో సైతం ప్రధాన కూడళ్లలో దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో మజ్జిగ చలివేంద్రం… *ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ….
09
Apr