లీడర్ న్యూస్ (తణుకు) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఆయన తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్థన్రెడ్డిలను కలిసి ఆయా శాఖలకు సంబంధించి తణుకు నియోజకవర్గానికి అవసరమైన నిధులు, తదితర అంశాలపై చర్చించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.
సీఎం చంద్రబాబును కలిసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ… *ఆయా శాఖల మంత్రులతోనూ రాధాకృష్ణ భేటీ…
10
Apr