ఆల్ ఇండియా ఫూలే, అంబేడ్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్ధంతి వేడుకలు

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఆల్ ఇండియా ఫూలే అంబేడ్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు.స్థానిక బాయ్స్ హైస్కూల్ వద్ద ఉన్న విగ్రహానికి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పొట్ల సురేష్ పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కలలు కనండి వాటిని సహకారం చేసుకోండి అంటూ భారత యువతను తట్టి లేపిన మహా పురుషుడు అబ్దుల్ కలాం అన్నారు.ఈ కార్యక్రమంలో వల్లూరు శ్రీరామ్యు, యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి మెరిపే శీను,
ఎస్ పెద్దిరాజు,భరత్, వల్లూరి దత్త సాయి, పొట్ల రమేష్, నాగరాజు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *