*విద్యార్ధులకు యునిఫామ్స్ , స్కూల్ పుస్తకాలు అందించిన తణుకు ఎమ్యెల్యే ఆరిమిల్లి*                         

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మానవత సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాలలో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యార్ధులకు యునిఫామ్స్, బుక్స్ పంపిణి చేసారు. ఈ సందర్భంగా విధ్యార్ధులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ విద్యార్ధులు అంతా లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని చేదించే విధంగా కృషి చేయాలని అన్నారు. డా. బి ఆర్ అంబేద్కర్ , డా బాబు జగ్గజీవన్ లాంటి మహా వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో ఈసారి తణుకు నుండి 4*400 రిలే లో పాల్గొనేందుకు వెళ్ళిన దండి జ్యోతిక శ్రీ కు గతంలో ఎమ్యెల్యే గా ఉన్న సమయంలో మొదటగా నేషనల్స్ కి పంపించడం జరిగిందని నాడు 1 లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడం జరిగిందని నేడు ఒలింపిక్స్ లో పాల్గొనడం మనకెంతో గర్వకారణమని అటువంటి స్పూర్తితో ముందుకు సాగాలని విద్యార్ధులకు సూచించారు. బానిస అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *