లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కోలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన లైంగిక దాడి, హత్యకు నిరసనగా తణుకు బార్ అసోసియేషన్లు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదులు ఆధ్వర్యంలో మంగళవారం నాడు తణుకు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాసిల్దారు వర్మకు మెమొరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఆర్ జి కార్ మెడికల్ కాలేజీలో జరుగుతున్న అవినీతి బాగోతాలను వెలికి వస్తుందని భయంతో లేడీ ట్రైనింగ్ డాక్టర్ హత్య చేయడం దుర్మార్గమని అన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహిళా, వైద్య ఆరోగ్య, హోంశాఖ లను కూడా మమతా బెనర్జీ నిర్వహిస్తూ రాష్ట్రంలో మహిళకు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి పాస్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితురాలు కుటుంబానికి పూర్తి రక్షణ ప్రభుత్వం కల్పించాలని వారు కలకత్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఇది కేవలం ఉద్దేశపూర్వకంగ చేసిన హత్యని వారు అన్నారు.దేశంలో ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే డాక్టర్లకు రక్షణ కల్పించాలని మహిళలకు రక్షణకు చర్యలు చేపట్టాలని న్యాయవాదులు కేంద్ర పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందుతుడిని వెంటనే శిక్షించాలి…
20
Aug