రాష్ట్రంలో పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలి – హోం శాఖ రివ్యూలో సీఎం చంద్రబాబు

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి)నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలని హోంశాఖ రివ్యూ సమావేశంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  శాంతి భద్రతల విషయంలో రాజీలేదు..పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు.ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి.విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా..డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించండి..గంజాయి, డ్రగ్స్ తరిమేయండి.ఏపి పోలీసు శాఖ ప్రతిష్ట మళ్లీ నిలబెడదాం..ప్రజల భద్రతకు భరోసా ఇద్దాం.2014-19 పోల్చితే 2019-24 లో క్రైం రేట్ 46 శాతం పెరిగిందన్న అధికారులు.పోలీసు శాఖలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు నిధుల విడుదలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *