డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఆహారం పంపిణీ చేసిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ & కూటమి నాయకులు…

లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు నర్సాపురం శాసనసభ్యులు  బొమ్మిడి నాయకర్, కూటమి నేతలు , విజయవాడ జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్  సమన్వయంతో విజయవాడలోని అధిక వర్షాలు కురిసిన ప్రదేశాలలో ( సింగ్ నగర్ ,వైఎస్ఆర్ కాలనీ, కృష్ణలంక , ఫైరి ) ఏరియాలలో సుమారుగా 4000 ప్యాకెట్ల బియ్యం , 8000 పాల ప్యాకెట్ లు , 25000 లీటర్ల bisleri వాటర్ బాటిల్స్,కూరగాయలు, 2500 మీనా బ్రెడ్స్ మరియు నిత్యవసరసరకులు ( 20 టన్నులు) వరకు పంపిణి చేసియున్నారు. అదేవిధముగా ,పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు వారి ఆదేశముల ప్రకారం కృష్ణా జిల్లా కలెక్టర్ వారికి సుమారుగా 1000 ప్యాకెట్ల బియ్యం , కూరగాయలు, 2500 మీనా బ్రెడ్స్ మరియు నిత్యవసరసరకులను ( 5 టన్నులు) పంపకము నిమిత్తం అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *