తణుకు మున్సిపాలిటీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా బసవ రామకృష్ణ…

లీడర్ న్యూస్ :- గత రెండు రోజులుగా ఎంతో ఉత్కంట భరితంగా నడిచిన తణుకు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిని ఎట్టకేయులకు నేడు ఖరారు చేయడంతో ఉత్కంటకు తెరపడింది.. టీడీపీ సీనియర్ నాయకులు బసవ రామకృష్ణ ని కూటమి తరపున చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. 2000 – 2005,2014 – 2019 వరకూ తణుకు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు. 2015 – 2017 వరకూ తణుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసారు. పైడిపర్రు కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గా పనిచేశారు.. 4 పర్యాయాలు రోటరీ క్లబ్ అధ్యక్షులుగా… Apsrtc మజ్జర్ యూనియన్ తణుకు డిపో గౌరవాధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రెవేట్ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవధ్యక్షునిగా, పశ్చిమగోదావరి జిల్లా ప్రెవేట్ స్కూల్స్ అసోసియేషన్ మెంబెరుగా, తణుకు వాకర్స్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేశారు. రవీంద్ర ఐటీఐ, ఆదర్శ స్కూల్ లాంటి పలు విద్యా సంస్థలకు చైర్మన్ గా బసవ వ్యవహారిస్తున్నారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *