బ్యానర్ తొలగింపు రాజకీయం చేయడం సరికాదు -తెలుగు యువత అధ్యక్షులు చెన్నంశెట్టి హరి నాయుడు

లీడర్ భాస్కర్ న్యూస్ (ఉండి) బ్యానర్ తొలగింపును రాజకీయం చేయడం సరికాదని ఉండి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చెన్నంశెట్టి హరి నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని మొట్టమొదటిగా గళం విప్పి అంబేద్కర్ రాజ్యాంగం కోసం పాటుపడిన వ్యక్తి రఘురామకృష్ణంరాజు అని అన్నారు. అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని ఆయనను ఒక వర్గానికి మాత్రమే ఆపాదించడం సరికాదని అంబేద్కర్ అందరివాడు అని హరి నాయుడు అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలోని నాగేంద్ర స్వామి ఆలయానికి అడ్డుగా ఎస్సీ వర్గీకరణ వద్దు అనే పేరుతో ఒక బ్యానర్ ను అక్కడి దళిత సోదరులు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ గుడి అరుగు మీద ధూమపానం చేయడం వలన గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అక్కడ వారు ఎంత చెప్పినప్పటికీ వారు బ్యానర్ ను తొలగించకపోగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించడంతో అక్కడే హిందూ సోదరులు ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణం రాజు గారి దృష్టికి తీసుకెళ్లారని ఆయన వివరించారు. వెంటనే స్పందించిన రఘురామకృష్ణంరాజు ఆ ఆలయాన్ని సందర్శించి అడ్డుగా ఉన్న బ్యానర్ కర్రను తీసే సమయంలోనే బ్యానర్ చిరిగిందని దీనిపై ప్రతిపక్ష నాయకులు దళిత సోదరులను రెచ్చగొట్టి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పై చర్యలు తీసుకోవాలని ధర్నాలు చేయించడం బాధాకరమని అన్నారు. ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తూ మునిపెన్నడు లేని విధంగా పంట కాలువలను, మురుగు కాలువలను ప్రక్షాళన చేయిస్తూ రైతులకు కనుమూరి రఘురామ కృష్ణంరాజు వెన్నంటే ఉన్నారన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ, బిసి వసతి గృహాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారికి కావలసిన వసతులను మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు. ఆ వసతి గృహాలను అభివృద్ధి చేయడం వలన దళిత విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతారన్నదే ఆయన అభిలాష అని అన్నారు. అంబేద్కర్ అన్న, దళితుల అన్న ఆయనకు గౌరవం ఎక్కువ అని ఇప్పటికే ఆయన వివరణ ఇచ్చారని దళిత సోదరులు ఈ విషయాలను గ్రహించి దీనిని రాజకీయం చేసే వారికి గుణపాఠం చెప్పాలని హరినాయుడు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *