లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ) పిఠాపురంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం తనకు బాధ కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని, లేదంటే తప్పించుకునేవాడని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
బాలికపై అత్యాచారం.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
08
Oct