లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దాడుల్లో తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పెనుమంట్ర మండలం ఎస్. ఇలింద్రపురం గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న గుబ్బల వెంకట సత్యనారాయణ (53) అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 20 బాటిల్స్ మద్యంను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి మరియు ఎస్సైలు బి.లక్ష్మి మరియు ఆర్ .మధుబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కొత్త మద్యం పాలసీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 8 మంది బెల్ట్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వారి వద్ద నుండి 139 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు తణుకు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు. ఎవరైనా అనధికారికంగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ మరియు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు.
బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్… 20మద్యం బాటిల్స్ స్వాధీనం…!
07
Nov