జనసేన ఆవిర్భావ దినోత్సవం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి – బొలిశెట్టి రాజేష్

లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం)తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జనసేన పార్టీ మండలం స్థాయి నాయకుల సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ యువ నేత బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం వేదికగా మార్చ్14 న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక సభ ను జయప్రదం చేయాలని కోరారు. జనసేన పార్టీ గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం నెలకొల్పాలని క్రౌడ్ మేనేజ్మెంట్ సభ్యులు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ప్రతీ కార్యకర్త పాల్గొనాలన్నారు. ఆవిర్భావ సభ గ్రౌండ్ మేనేజ్మెంట్ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గురువారం జనసేన ఆవిర్భావ సభ సన్నాహ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించడం ప్రజల సమస్యలను ప్రశ్నించడం కోసం మొదలుపెట్టి నేడు ప్రజల సమస్యలు తీర్చే స్థాయికి ఎదిగారు అన్నారు. ప్రతిపక్ష నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనమంతా సంయమనంగా సమాధానం చెప్పామని దాన్ని అలుసుగా తీసుకొని కొందరు రెచ్చిపోతున్నారన్నారు. వారి స్థాయికి దిగజారకుండా ప్రతి కార్యకర్త మన నేతను విమర్శిస్తే మనమంతా సమాధానం చెప్పాలని .రాష్ట్రంలో దేశంలో జనసేన పార్టీకి ఎంతో ఆదరణ ఉందని ఆదరణ అంతా పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది అన్నారు.ఆ స్థాయిని మనం మరింత పెంచే విధంగా ప్రతి జన సైనికుడు మెలగాలని ఈనెల 14వ తేదీన పిఠాపురం వేదికగా నిర్వహించే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు ప్రతి జన సైనికులు,వీర మహిళలు,నాయకులు పాల్గొని పార్టీ ప్రతిష్టాత్మక ఆవిర్భావ వేడుకలని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పేరా బత్తుల రాజశేఖర్ గెలిపించిన నియోజకవర్గంలో పార్టీని వెనకుండి నడిపిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు కి మండల రాజకీయ నాయకులందరికి కార్యకర్తలకి అయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబి,కసిరెడ్డి మధులత,కొనగల హరినాథ్, లక్ష్మారెడ్డి,శ్యామల సురేష్, నరావుల సంతోష్, అడబాల నారాయణమూర్తి, పైబోయిన వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్రప్రసాద్, నీలపాల దినేష్, చాపల రమేష్, అడ్డగర్ల సురేష్, జనసేన పార్టీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *