లీడర్ న్యూస్ (ఉండ్రాజవరం) సంఘంలో జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నానని, మహిళలకు న్యాయం చేస్తున్నానని కొందరు నాపై దురుద్దేశంతో అంబేద్కర్ బహుజన కార్యాలయం నడిపిస్తున్నానని నా పై బురద జల్లి నన్ను ఇబ్బంధులకు గురించేయాలనీ చూస్తున్నారని పూలే అంబేద్కర్ బహుజన ఫౌండషన్ రాష్ట్ర చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వర అన్నారు. మోర్త గ్రామము నుండి వేలివెన్ను వెళుతుండగా నన్ను కొందరు వెంబదించి నాపై కుట్ర చేయాలనే ఉద్దేశంతో వెంబడించారని, అక్కడున్న స్థానికులు నేను వారిని ఎదుర్కొనే సమయంలో పారిపోవడంతో ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, నిందితులను గుర్తించి తనకు న్యాయం చేయాలని యార్లగడ్డ వెంకటేశ్వర కోరారు. సమాజంలో అన్ని వర్గాలను అన్ని కులాలను మతాలను కలుపుకొని వెళ్లే తనపై ఇటువంటి దాడులకు దిగటం బాధాకరమని వెంకటేశ్వరరావు అన్నారు.
అన్యాయాలపై ప్రశ్నిస్తే బెదిరిస్తారా…?
04
Oct