రాఘవేంద్రస్వామి వారికి తణుకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు… మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి దర్శనం చేసుకున్న ఆరిమిల్లి రాధాకృష్ణ..

లీడర్ న్యూస్ (తణుకు)  కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి వారిని గురువారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, సహచర ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్‌రావు, కాల్వ శ్రీనివాసులు, ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావులతో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రంలోని ప్రజలు చిరకాలం సుఖసంతోషాలతో జీవించాలని రాఘవేంద్రస్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *