మెడికల్ కళాశాలలు ప్రెవేటీకరణ నిర్ణయం దారుణం – మాజీ మంత్రి కారుమూరి

లీడర్ న్యూస్ (అత్తిలి) గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యం తో రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఉండాలని తలపెట్టిన కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రేవైటికరణ చేయాలనే నిర్ణయం తీసుకోవడం దారుణమని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి  వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్తిలి మండలం పాలి గ్రామంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కారుమూరి మాట్లాడుతూ  ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ చేయటం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి ప్రజా అమోగ్యమైన పరిపాలన చేశారన్నారు. వైయస్ఆర్ సిపి పేదల ప్రభుత్వం అయితే… కూటమి ప్రభుత్వం పెత్తందారులకు అనుకూల ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *