Gold Price Today: వామ్మో పరుగు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా ?

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అవి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కిందకు రావడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆల్ టైమ్ రికార్డు ధరకు బంగారం, వెండి ధరలు.. బంగారం 72 వేల మార్క్‌ను దాటగా.. వెండి రూ. 84 వేల మార్కు. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం కూడా ధరలు పెరిగాయి. ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71 వేల 740. వెండి కిలో రూ.83,400. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే.. పెళ్లిళ్ల సీజన్ నాటికి ధరలు పెరుగుతాయన్న వ్యాపారవర్గాల అంచనాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో రాగి, వెండి ధరలపై ఓ లుక్కేయండి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Related News

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,910 కాగా, 24 క్యారెట్ల ధర రూ.71,890గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,760, 24 క్యారెట్ రూ.71,740,

చెన్నైలో 22 క్యారెట్ రూ.66,710, 24 క్యారెట్ రూ.72,770,

బెంగళూరులో 22 క్యారెట్లు రూ.65,760, 24 క్యారెట్లు రూ. .71,740.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్లు రూ.65,760 కాగా, 24 క్యారెట్లు రూ.71,740.

వెండి ధరలు

  • ఢిల్లీలో వెండి కిలో ధర రూ.84,400,
  • ముంబైలో రూ.84,400,
  • బెంగళూరు రూ.83,850,
  • చెన్నై రూ.87,900,
  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.87,900గా ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *