లీడర్ న్యూస్ :- తూర్పు గోదావరి జిల్లా పసలపూడి, కాల్దరి గ్రామాల వరి పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు సూచించారు.
రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులను పులి సంచరించే ప్రాంతాలకు దూరంగా, సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలి. పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలియజేశారు.ప్రజలు, రైతులు, పశువుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండాలని సూచించారు.